Wednesday, 21 March 2018

ప్రజల విశ్వాసం గెలుచుకునేలా మన పనితనం వుండాలి – జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 21 ; ప్రజల విశ్వాసం గెల్చుకునేలా మన యొక్క పనితనం వుండాలని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెన వార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా హెడ్ క్వార్టర్ లోని పెరేడ్ మైదానం నందు జిల్లా ఎస్పి మరియు అడిషనల్ ఎస్పి గోద్రులు నూతనంగా జిల్లా కు కేటాయించబడిన( 63 సివిల్ + 61 ఎఆర్ =124 )మంది కానిస్టేబుల్ లతో పరిచయ కార్యక్రమము ను నిర్వహించారు, ఈ సమావేశం లో జిల్లా ఎస్పి మాట్లాడుతూ శిక్షణ లో  నేర్చుకున్న అంశాలను నిత్య జీవితం లో ఆచరణ పెట్టాలని , పోలీస్ శాఖ అంటేనే  సేవకు మొదట వుండేదని గుర్తువుంచుకోవలన్నారు, మారుతున్నకాలం నకు అనుగుణం గా వస్తున్న నూతనత్వం, సాంకేతికతను ను  అనువయిస్తూ ముందుకు పోవాలన్నారు, మెరుగైన సేవలే మనలను ప్రజల వద్దకు చేర్చి మన ప్రతిష్ట ను పెంచుతాయి అన్నారు , మెరుగైన పోలీసింగ్ తో మన గౌరవం ను  పతాక  స్థాయి కు తీసుకుపోయేలా మన అందరం కలిసి పనిచేయాలనీ జిల్లా ఎస్పి సూచించారు, అనంతరం ఎస్పి మరియు అడిషనల్ ఎస్పి గోద్రు లు జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం మరియు మన జిల్లా  సరిహద్దుల గురించి మన జిల్లా పోలిసుల పనితీరు గురించి మరియు మన వాడుతున్న సాంకేతికత గురిoచి తెలియచేశారు.  ఈ కార్యక్రమము లో అడిషనల్ ఎస్పి గోద్రు, సిసి కిరణ్ కుమార్ , హెడ్ క్వార్టర్ ఆర్ ఐలు సంతోష్ కుమార్, శేఖర్ బాబు ,శ్రీనివాస్, ఏఎస్సై జాఫర్ మరియు పీ ఆర్ ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment