Wednesday, 14 March 2018

అక్రమ అరెస్టులకు భయపడేదిలేదు ; కాంగ్రెస్ నాయకులు


 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 14 ;  పదకొండు మంది కాంగ్రెస్ శానసభ్యులను అక్రమంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలో భాగంగా కొమురంభీం జిల్లా రెబ్బెన  మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహింహా తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని రెబ్బెన మండల కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి తెరాస ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని అరెస్టైన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారుకాంగ్రెస్ నాయకులు మాట్లాడుతు తెరాస ప్రభుత్వం అప్రజాస్వామికంగా,నిరంకుశ విధానాలతో యావత్ తెలంగాణ ప్రజల గొంతు నొక్కె ప్రయత్నంలో భాగంగా 11 మంది కాంగ్రెసు పార్టీ శాసనసభ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ  ధర్నా కార్యక్రమాన్ని ముందే అక్రమ అరెస్టులతో అడ్డుకున్న పోలీసులు  అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారని అన్నారు.  ఆరీ పోయే దీపానికి వెలుగు ఎక్కువ! అని ప్రజావ్యతిరేక విధానాలతో తీవ్ర అశాంతికి గురవుతున్న ప్రజల అ శాంతిని శాసనసభలో వినిపించిన నాయకులను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెరాస ప్రభుత్వం రాబోయే ఎన్నికలలో అధికారం కోల్పోతుంది అని అన్నారు. 2019 లో అధికారములోకి రావడమే లక్ష్యంగా ఇటువంటి జైలు గోడలకు భయపడేది లేదు అని అన్నారు. ఈ అరెస్ట్ లో  డి.సి.సి ఉపాధ్యక్షులు పల్లె ప్రకాశ్ రావ్, ఏం.పి.టి.సి కోవూరు శ్రీనివాస్, సర్పంచ్ ముంజం రవిందర్, పి.ఎ.సి.ఎస్ చైర్మన్ గాజుల రవిందర్, వైస్ చైర్మన్ వెంకటేశం చారి, గోలేటి నాయకులు పల్లాస్,బానయ్య,వెంకన్న తదితర నాయకులు ఉన్నారు.

No comments:

Post a Comment