కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 10 ; ఆదుని క సాంకేతిక అంశాలలో శిక్షణ మనలోని ఆత్మ విశ్వాసం ను రెట్టింపు చేస్తుందని , అటువంటి నైపుణ్యాలు మనలను వృతి లో రాణిoచేలా ఉపకరిస్తాయని మరియు ప్రజలల లో మన నైపుణ్యా లు మన పని తీరు కు ఒక గీటురాయి అవుతుందని డిఎస్పి సత్యనారాయణ అన్నారు. శనివారం జిల్లా లోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ నందు 3 రోజులసాంకేతిక శిక్షణ శిబిరం ముగింపు సభ లో ఆసిఫాబాద్ సబ్ డివిజన్ డిఎస్పి సత్యనారాయణ పాల్గొని , శిక్షణ అభ్యర్థులకు ఎంటర్ ప్రైజస్ అఫ్ ఈ కాప్స్ పైన శిక్షణ తరగతులను నిర్వహించారు. , ఎంటర్ ప్రైజస్ అఫ్ ఈ కాప్స్ యొక్క ప్రాముఖ్యత ను శిక్షణ అభ్యర్థులకు వివరించారు, అదునాతనమైన టెక్నాలజీ ను మేలవించడం ద్వారా నేరాల ను ఒక త్వరిత గతిన లో చేదించవచ్చు అని వారికి తెలిపారు. ట్రైనింగ్ ఇంచార్జ్ కర్రే స్వామి మాట్లాడుతూ సి సి టి ఎం ఎస్ లో సమాచారం నిక్షిప్తం చేయటం ద్వారా కెసుల యొక్క క్రమపద్దతి తో పాటు , నేరస్తుల యొక్క మోడస్ ఒపరెంది ( నేరం చేయు విధానం) కూడా తెలుస్తాయని అవి నేర విచారణ లో ఒక ముఖ్య భూమిక పోషిస్తాయని తెలిపారు, మరియు 100 డయల్ కాల్ ఇంచార్జ్ మోహన్ 100 డయల్ కు స్పందించాల్సిన తీరు మరియు 100 డయల్ పని తీరు ను వివరించారు. ఈ కార్యక్రమము లో ఐటి కోర్ ఇన్ స్పెక్టర్ కర్రే స్వామి ,ఆర్ ఐ సంతోష్ కుమార్ , ఏఎస్సై చంద్ర మిస్త్రి , ఐటి కోర్ టీం సభ్యులు శ్రినివాస్ , రమేష్, విజయ్ లాల్ , మాణిక్ రావు , మణిధర్ , 100 డయల్ కాల్ ఇంచార్జ్ మోహన్, ఫింగర్ ప్రింట్ ఇంచార్జ్ తిరుపతి మరియు పీ ఆర్ ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment