కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 8 ;గత ప్రభుత్వాలు ప్రజలకు ఏమి చేశాయని , ప్రజలకు ఒరిగింది ఏమి లేదని, రెబ్బెన మండల జడ్ పిటిసి అజ్మేర బాపురావు మరియూ ఎంపిటిసి కర్నాధం సంజీవ్ కుమార్ లు అన్నారు. బుధవారం రెబ్బెన ఆర్&బి గెస్ట్ ఔజ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ తెరాస రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయి అని బీజేపీ నాయకులు తెరాస ప్రభుత్వం పై చేస్తున్న విమర్శల్లో నిజం లేదని.తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని అలాగే తెరాస ప్రభుత్వం కల్యాణ లక్ష్మి,శదీముబార్క్ క్రింద ప్రతి ఇంటి పెళ్లి కావాల్సిన ఆడపిల్లను ఆదుకుంటుందని అలాగే వృద్దులకు,వికలాంగులకు వితంతువులకు ఆసరా పింఛను అందిస్తుందని దళితులకు మూడు ఎకరాల్లో భూమి ఇచ్చే పథకం లో భాగంగా ఇప్పటివరకు కొంత పూర్తయిందని భూమి పొందని వారి కోసం ఎవరైనా భూమి అమ్మే వాళ్ళు ముందుకు వస్తే ప్రతి గ్రామంలో కూడా దళితులకు మూడు ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో నిరంతర కృషి జరుగుతుందని తెలియజేసారు.జన్ ధన్ ఖాతాలో డబ్బులేస్తాను అన్న ప్రధాన ఆ మాటను మరచి జిఎస్టీ పేరుతో ధరలను ఆకాశాన్ని ఎక్కించి సామాన్యుడికి అందకుండా చేసారు.బ్యాంకుల్లో నగదు లేకుండా చేసి ప్రజలు నానా అవస్థలు పడేలా చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఈ రోజు తెరాస ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదన్నారు.ఇప్పటికైనా ఈ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం నాయకులూ తెలుసుకోవాలి అని తెలిపారు.ఇకముందైనా బిజెపి ప్రభుత్వం తెరాస ప్రభుత్వం పై తప్పుడు విమర్శలు చేయరాదన్నారు. ఈ సమావేశం లో జడ్ పిటీసి అజ్మేర బాపూరావు,ఎంపీటీసీ కర్నాధం సంజీవ్ కుమార్,రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ,సింగిల్ విండో డైరెక్టర్ మదునయ్య,మోడెం చిరంజీవి గౌడ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment