కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 13 ; తెలంగాణ జాగృతి వ్వవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భముగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రెబ్బన లో జన్మదిన వేడుకలు జరిపారు . ముందుగా కేక్ కట్ చేసి కవితక్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ యూవతకు ఉపాధి, తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తూ అన్నిరంగాలలో మహిళలకు ఉపాధి కల్పిస్తూ అందరికి ఆదర్శంగా గా నిలిచింది అన్నారు. అలాగే మన రాష్టం లోనే కాక ఇతర దేశాలలోను, రాష్టాలలోను మన సంప్రదాయాలను తెలియజేయడానికి కృషి చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ అరుణ, కే లక్ష్మి ,డి శంకరమ్మ, దేవక్క, పద్మ, లతా, ఎం పద్మ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment