Thursday, 15 March 2018

గోలేటి మరియు మాదారం లలో ఉచిత ఆయుర్వేద శిబిరం

  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 15 ; బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో మార్చ్ 16 న మాతా రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత ఆయుర్వేద శిబిరం నిర్వహిస్తున్నట్లు సింగరేణి అధికార ప్రతినిధి జె  కిరణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శరీరంలో మూడు ధాతువులు సమంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని, హెచ్చుతగ్గులుగా ఉంటె అనారోగ్యమని ఈ త్రిదోష సిద్ధాంత ప్రాతిపదికనేఆయుర్వేదం అవతరించిందని ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ విశ్వనాధ మహర్షి తెలిపారు. కావున గోలేటి మరియు మాదారం లోని కార్మికులు, మాజీ కార్మికులు, పరిసర ప్రాంత ప్రజలు ఈసదవకాశాన్ని వినియోగించాలని కోరారు.

No comments:

Post a Comment