Sunday, 18 March 2018

బీజేవైఎం ఆధ్వీర్యంలో ఉగాది పచ్చడి పంపిణి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 18 ;  శ్రీ విలంబినామ ఉగాది సందర్భంగా కొమురంభీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో బీజేవైఎం ఆధ్వీర్యంలో ఉగాది పచ్చడిని ప్రజలకు పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాలాజీ వర ప్రసాద్ హాజరై పచ్చడి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విశాల్ ఖాండ్రే  మాట్లాడుతూ తేలుగు సంవత్సరాది ఐన విళంబినామ ఉగాది ప్రజలకు మేలు చేయాలనీ ఆకాక్షించారు. పంటలు బాగా పండాలని ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  బీజేవైఎం నాయకులు విజయ్ కుమార్, రాజ్ కుమార్, , రాజు, రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment