Tuesday, 27 March 2018

సి పి ఐ మహాసభల గోడ ప్రతుల విడుదల

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 27 ; ఏప్రిల్   ఒకటవ తేదినుండి నాల్గవ తేదీవరకు హైదరాబాద్ లో జరగనున్న సిపిఐ మహాసభలకు సంబందించిన గోడ ప్రతులను మంగళవారం కొమురంభీం జిల్లా రెబ్బెన,  ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మండలాల్లో విడుదల చేసారు. రెబ్బెన మండల  కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో సిపిఐ  జిల్లా కార్యవర్గ సభ్యులు బోగే ఉపేందర్, మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్యలు విడుదలచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజలు ఎంతో  కస్టపడి, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా మరచి, ప్రజలను, నిరుద్యోగులను, రైతులను మోసంచేసిందన్నారు. ఇక  కేంద్రంలో అధికారంలో  ఉన్న బీజేపీ  ప్రభుత్వం  ప్రజల మధ్య  కుల, మత   చిచ్చులను రేకెత్తించి దేశాన్ని  మరిన్ని కష్టాలలోకి నెట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కుందారపు బసవయ్య, రెబ్బెన సిపిఐ మండల కార్యదర్శి రామడుగు శంకర్, ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, నాయకులూ శ్రీనివాస్, కిషన్, గణేష్, కేదారి, శంకర్, పూదరి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment