Wednesday, 14 March 2018

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 14 ;  కోరంభీమ్ జిల్లా కేంద్రం  ఆసిఫాబాద్  ఎంపీడీఓ కార్యాలయం లో ఎమ్మెల్యే కోవ లక్ష్మికల్యాణ లక్ష్మి చెక్కు లను పంపిణి చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టమ్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి పథకంలో ఏంతో మంది పేదింటి ఆడపిల్లల తల్లితండ్రులు లబ్ది పొందారన్నారు. బుధవారం పంపిణి చేసిన లబ్ధిదారుల్లో వాంకిడి మండలం నుంచి 5 గురు, రెబ్బెన మండలం  నుంచి 11 మంది ఆసిఫాబాద్ మండలం నుంచి  17 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ అలీ, చిలివేరి వెంకన్న , గాదివేణి మల్లేష్, అహ్మద్  ఎంపీటీసీ రవీందర్, ఆత్మ చైర్మన్ రమేష్  రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే  కెరమెరి మండలం లో కల్యాణ లక్ష్మి చెక్కు లను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కలామ్, యూనుస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment