కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Saturday, 17 March 2018
ముఖ్యమంత్రి హామీలలో విఫలం - వై గట్టయ్య
గోలేటి బ్రాంచి రెండవ మహాసభ
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 17 ; ముఖ్యమంత్రి కేసీర్ ఇచ్చిన హామీలలో పూర్తిగా విఫలమయ్యారని ఐటీయూసీ అధ్యక్షులు వై గట్టయ్య అన్నారు . సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 2వ మహాసభలు గోలేటి లోని కెఎల్ మహేంద్ర భవన్ లో శనివారం జరిగింది. ఈ మహాసభలకు ముఖ్య అతిధిలు గా సింగరేణి సెంట్రల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కా. వై.గట్టయ్య, కేంద్ర కార్యదర్శి కె.సమ్మయ్యలు హాజరు అయ్యారు. అంతకు ముందు పార్టీ కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్థూపానికి నాయకులు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గట్టయ్య మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామిలను అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా వాటి అమలు కై పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్మికుల హక్కుల సాధనలో నిరంతరం పోరాడే సంఘం ఏఐటీయూసీ ఒక్కటేనని, సింగరేణి కార్మికులకు టీబీజీకేఎస్ చేసింది ఏమి లేక పోగా కార్మికులకు టీబీజీకేఎస్ నాయకులు మొఖం చూపించే పరిస్థితి లేదని అన్నారు. ప్రస్తుతం కార్మికులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని, ఓడిపోయిన యూనియన్ గా ఉన్నప్పటికీ ఏఐటీయూసీ ఎప్పుడు కార్మికుల పక్షమేనని ఆయన కార్మికులకు భరోసానిచ్చారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ చేస్తానని, ఇప్పుడు మాయమాటలు చెపుతున్నాడని గట్టయ్య అన్నారు. సింగరేణి లో కారుణ్య నియామకం ఎప్పటి నుండో ఉందని కొత్తగా వీళ్లు అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ఏఐటీయూసీ సీపీఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు జగ్గయ్య, బయ్య మోగిలి, బోగే ఉపేందర్, జూపక రాజేష్, దుర్గం రవీందర్, రాయుల్లా నర్సయ్య, పూదరి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment