కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 4 ; ప్రాథమిక సహకార సంఘాల్లో ఏటీఎం లు అందుబాటులో ఉన్నాయని రైతులు ఇక నుండి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారానే లావాదేవీలు జరుపుకోవాలని ఎఫ్ఎన్ సి అంజన్న అన్నారు. ఆదివారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లోని రాజారం గ్రామములో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రాథమిక సహకార సంఘాల్లో ఏటీఎం లు ఉన్నాయని ఇక నుండి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారానే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయవచ్చు అని తెలిపారు. ప్రభుత్వం తరుపున వచ్చే లబ్ది దారుల ఋణం ఈ ఖాతాలో జమ అవుతాయని లబ్ధిదారులు నగదు రహిత లావాదేవీలకు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పదివేల వరకు నగదు లావాదేవీలు జరుపుకునే అవకాశాన్ని కలిపించాము దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ అవగాహన సదస్సులో సహకార సంఘం కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment