Friday, 30 March 2018

గోలేటి లో ఉచిత వైద్య శిబిరం

రెబ్బెన మండలోని గోలేటి లో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఏప్రిల్ ఒకటవ తేదీన ఉదయం 10   గంటల నుండి హైదరాబాద్ నుండి  సూపర్ స్పెషలిస్టు  న్యూరోలాజి,    మరియు  కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్లు వస్తున్నారని సింగరేణి బెల్లంపల్లి ఏరియా డీజీఎం పర్సనల్  కిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో  తెలిపారు.  ఏరియాలోని కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, గుండె మరియు నరాల సంబంధిత వ్యాధులు గల కార్మికులు, మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతినెలా ఒకటవ మరియు నాలుగవ ఆదివారాలు ఈ వైద్య సేవలు  వినియోగించుకోవడానికి  రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

No comments:

Post a Comment