Wednesday, 28 March 2018

బీజేవైఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 28 ; రెబ్బెన మండలం పుంజుమ్మెరా గ్రామంలో రెబ్బెన మండల బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కార్యాలయ ఆవరణలో చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రంచేసారు. ఈ కార్యక్రమానికి    బీజేవైఎం జిల్లా అధ్యక్షులు  ఖాండ్రే  విశాల్ ముఖ్య అతిధి గ హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో   ప్రతిష్టాత్మికంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామా గ్రామానికి విస్తరించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో   రెబ్బెన మండల అధ్యక్షులు ఇగుర పు సంజీవ్, నాయకులూ గుండయ్య, విజయ్ కుమార్, కంట రావు, వెంకటేష్, రమేష్, రవీందర్, తైతరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment