
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 9 ; బంగారు తెలంగాణ సాధనలో ప్రజా సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని ఎం ఎల్ సీ పురాణం సతీష్ కుమార్ అన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి, నక్కలగూడ, సింగల్ గూడ, పుంజుమెరగుడ గ్రామాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవలక్ష్మి తో కలసి మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ నిధుల నుండి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ల పనులకై గురువారం శెంకుస్థాపన చేసారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ, తెరాస ప్రభుత్వ హయాంలో గత నాలుగేళ్లుగా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లోని పలు వా డ లలో తిరిగి ప్రజలనుంచి సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేసారు. నక్కలగూడా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ మరియూ ఎమ్మెల్యే రెబ్బెన మండలం లోని నక్కల గూడ ఎంపిపిఎస్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ పురాణం సతీష్ మరియూ కోవ లక్మి ఎమ్మెల్యే పాఠశాల అభివృద్ధి కై ఆరో ఓ వాటర్ ప్లాంట్ ను, బోర్వెల్, ప్రహరి గోడ ను మంజూరు చేస్తునట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజ్మెరా బాబు రావు ఎంపిపి కర్నాతం సంజీవ్ , రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ , వైస్ ఎంపిపి గుడిసెల రేణుక,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చెయిర్మన్ కుందారపు శెంకరమ్మ, చెన్నసోమ శేఖర్,సుదర్శన్ గౌడ్,నవీన్ జైస్వాల్,శాంతికుమార్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాస్ , పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎం. పోషమల్లు, ఉపాధ్యాయులు కాల్వల శంకర్, గ్రామ పెద్దలు, విద్యార్థి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment