కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 26 ; ఏఐటీయూసీ కేంద్రకమిటీ లో బెల్లంపల్లి ఏరియాకు చెందిన పలువురు నాయకులకు స్తానం దక్కిందని బెల్లంపల్లి ఏరియా గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి తెలిపారు.సోమవారం గోలేటిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల లో భూపాలపల్లిలో లో జరిగిన ఏఐటీయూసీ 15 వ మహాసభలో కేంద్ర కార్యవర్గ సభ్యులుగా తిరుపతి , మొగిలి , బి జగ్గయ్య, జి నరసింహ రావు లను నియమించినట్లు తెలిపారు. అలాగే కేంద్ర కౌన్సిల్లో వై సారయ్య, శేషశయన రావు, జూపాక రాజేష్ లకు అవకాశమిచ్చినట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఎప్పటి కప్పుడు స్పందిస్తూ, తక్షణమే వాటి పరిష్కారానికి పోరాటాలు సాగించే సంస్థ ఏఐటీయూసీ మాత్రమే అని అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కేంద్రకమిటి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మిక సోదరుల అభ్యున్నతికి నిరంతరం పాటు పడతామని అన్నారు. కేంద్ర కమిటీ లో బెల్లంపల్లి ఏరియాకు సముచిత స్తానం ఇచ్చినందుకు కృతసజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment