Thursday, 29 March 2018

స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 29 ; సింగరేణి సేవ సమితి అందించే స్వయం ఉపాధి అవకాశాలను ఉపయోగించుకోవాలని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనురాధ రవిశెంకర్ అన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ కమ్మినికెషన్ సెల్ అద్వర్యం లో నిర్మిస్తున్న ఆణిముత్యాలు షూటింగ్ లో భాగంగా క్లాప్ కొట్టి ప్రారంబించారు. టెలి ఫిలింషూటింగ్ ఈ నెల 26 వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు. సేవా సమితి అధ్యక్షురాలు అనురాధ రవిశెంకర్ మాట్లాడుతూ భూ నిర్వాసితులైన ఆర్ ఆర్ సెంటర్ వారికీ అందించే స్వయం ఉపాధి కోర్సుల గురించి వివరించారు. టైలరింగ్ సెంటర్ పై జరుపుతున్న షూటింగ్ ను. అదేవిదంగ ఆర్ ఆర్ సెంటర్స్ వారికీ టైలరింగ్,అగర్ బత్తి ,రెగ్జిన్ బ్యాగ్స్ లాంటి వాటిలో మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అలాగే యువకులకు మోటార్ డ్రైవింగ్, తేనెటీగల పెంపకం మొదలగు వాటి గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏరియా లోని పునరావాస కాలనీల్లో కల్పిస్తున్న వసతులు,కార్మిక కుటుంబాలకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు టెలిఫిలిమ్ ద్వారా షూటింగ్ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యాక్రమంలో  డిజిఎం పర్సనల్ జె కిరణ్ కుమార్, డి వై పియం రాజేశ్వర్ కెమెరామెన్ వెంకట స్వామి కమ్మినికెషన్ సెల్ కోఆర్డినేటర్ డి కూమార స్వామి ఆర్టిస్టులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment