Monday, 26 March 2018

సింగరేణి క్రీడాకారులను మరింత ప్రోత్సహహించాలి : జీఎం రవిశంకర్


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 26 ;   సింగరేణి సంస్థలో పనిచేస్తున్న యువ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చే అవసరం ఎంతైనా ఉందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కే రవిశంకర్ అన్నారు ఆదివారం రాత్రి గోలేటి టౌన్ షిప్ లోని  సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో డిప్యూటీ ఎస్ అండ్ జెఇ ఆధ్వర్యంలో ఎనభై అయిదువ వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా  నిర్వహించారు ఈ సందర్భంగా సింగరేణి కార్మిలకు టగ్ ఆఫ్ ఆర్ వార్ మహిళలకు బాల్ ఇన్  బాస్కెట్, చిన్నారులకు మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎం  రవిశంకర్ పోటీల విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను  అభివృద్ధి పరిచేందుకు ఏరియాలోని క్రీడకారులకు  అన్ని రకాల సౌకర్యాలు యాజమాన్యం ఏర్పాటు చేసిందన్నారుక్రీడాకారులు సైతం సంస్థ కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు సీనియర్ క్రీడాకారులకు యువ క్రీడాకారులకు మరింతగా ప్రోత్సాహమిచ్చి క్రీడలపై ఆసక్తి కల్పించాలని  ఇప్పటికే ఏరియాకు చెందిన పలువురు క్రీడాకారులు కోలిండియా పోటీల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వారికి ఆదర్శంగా  తీసుకుంటూ మిగిలిన క్రీడాకారులకు సైతం క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తున్నామన్నారు  ఉత్పత్తితో పాటు క్రీడలకుమరియు  కార్మికుల  సంక్షేమంలోనూ బెల్లంపల్లి ఏరియా అగ్ర గామిగా ఉందన్నారు. 

No comments:

Post a Comment