కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 3 ; భారతదేవంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ డే గెలుపుని కొమరంభీఎంజిల్లా బీజేపీ అధ్యక్షులు జేబీ పౌడెల్ అన్నారు . శనివారం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొన్న జరిగిన ఈశాన్యరాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లలో బీజేపీ విజయంసాధించిందన్నారు. నరేంద్రమోడీ, అమిత్ షా ల మార్గదర్శకత్వంలో బీజేపీ వచ్చే 2019 ఎన్నికలలో కూడా విజయంసాధిస్తుందని అన్నారు. రానున్న ఎన్నికలలో తెలంగాణలోకూడా విజయంసాధించి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అజమీర రామ్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్సులు కేసరి ఆంజనేయులు గౌడ్, మురళి, విజయ్ సింగ్, విశాల్ ఖాండ్రే , సత్యనారాయణ, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment