Saturday, 17 March 2018

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ వాల్ పోస్టర్ విడుదల

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 17 ;  కొమురంభీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో  శనివారం బహుజన లెఫ్ట్ ఫ్రంట్   జిల్లా కార్యాలయంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర  కార్యాలయం ప్రారంభోత్సవ వాల్ పోస్టర్ విడుదల  చేయడం జరిగిందని అంబేడ్కర్ సంఘం నాయకులు జాడి.రాందాస్ తెలిపారుబహుజన తెలంగాణ బహుజనులకే రాజ్యాదికారం అనే నినాదంతో మహాత్మా జ్యోతిరావు పూలే  డా.,బి.ఆర్. అంబేడ్కర్,  కారల్ మార్క్స్  మహనీయుల ఆశాయల సాధనకోసం తెలంగాణ రాష్ట్రంలోని అంబేడ్కర్  సంఘంతో పాటు 19 వామపక్ష పార్టీలతో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నదని అన్నారు.బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయాన్ని  2018 మార్చి 19న సాయంత్రం 5గం.లకు, గోల్కొండ క్రాస్ రోడ్స్,ముషీరాబాద్ లో ప్రముఖ సామాజిక ఉద్యమకారులు గుజరాత్ ఎం ఎల్ ఏ జిగ్నేష్ మెవాని ప్రారంభిస్తారన్నారు.  .   ఈకార్యక్రమంలో కూశన.రాజన్న సి పి  ఎం  జిల్లా కార్యదర్శి, కోట.వెంకన్న బి సి  సంఘం రాష్ట్ర కార్యదర్శి, నికోడే.రవీందర్ మాలి సంఘం రాష్త్ర నాయకులు, కోట.శ్రీనివాస్  టి మాస్  జిల్లా కో కన్వీనర్, దుర్గం.దినకర్ టి మాస్  జిల్లా నాయకులు, అల్లూరి.లోకేష్, జిల్లా నాయకులు,  గొడిసెల.కార్తీక్ ఎస్ ఎఫ్ ఐ  రాష్త్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment