కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి5 ; తెరాస ప్రభుత్వం మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ కొమురంభీం జిల్లా అధ్యక్షులు జేబి పౌడెల్ అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆసిఫాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నానిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, రైతుల రుణమాఫీ, ఇంటింటికి ఉద్యోగం, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు, ఇస్తామనిచెప్పి, అధికారంలోకి వచ్చి తర్వాత ఉన్నోళ్లకు వచ్చే పింఛన్ లను తీసేశారు. అధికారంలోకివచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా చేస్తానని చెప్పిన వాగ్దానాలు ఒకటి కూడా నెలవేర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమీఇవ్వట్లేదని చెప్తున్నారు ఆరు లక్షల కోట్లు వ్యవసాయ రుణాల కోసం పది లక్షల కోట్లు వీడో పెన్షన్ల కోసం పదమూడు వేల పద్నాలుగు లక్షల కోట్లు ఫసల్ బీమా యోజన కోసం పదిహేనువందల లక్షల కోట్లు వడ్డీ రాయితీ ఇరవై లక్షల కోట్లు ముద్ర బ్యాంక్ లోన్ కింద ఏడు లక్షల కోట్లు మరియు సబ్సిడీ కోసం మూడువేల ఎనిమిది వందల లక్షల కోట్లు రైతుల కరెంటు సబ్సిడీ కోసం పన్నెండు వందల లక్షల కోట్లు గిరిజన అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చింది ఈ కెసిఆర్ చేసిన వాగ్దానాలు చేసేవరకూ భారతీయ జనతాపార్టీ ఉద్యమిస్తుందని ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మరని తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోనగిరి సతీష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్ల మురళీధరన్, పార్లమెంటరీ కన్వీనర్ సిర్పూర్ రావన్ నాయక్ బిజెవైఎం జిల్లా అధ్యక్షులు విశాల్ ఖాండ్రే , బి సీ మోర్చా అధ్యక్షులు పసునూరి తిరుపతి , బీజేవైయం జిల్లా సోషల్ కన్వీనర్ బి రాధిక, బిజెపి మండల కార్యదర్శి గెడ్డల మల్లయ్య , శారద, శిరీష ,మారు, సోము తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment