Saturday, 10 March 2018

సావిత్రి బాయి పూలె వర్ధంతి

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 10 ; దళిత స్త్రీల విద్య వ్యాప్తికి సావిత్రి బాయి పూలె ఎంతగానో కృషి చేసారని బిజెవైఎం జిల్లా అధ్యక్షులు కాండ్రే విశాల్  అన్నారు.  శనివారం కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లో  బిజెవైఎం జిల్లా కార్యాలయం లో సావిత్రి బాయ్ జ్యోతి రావ్ పూలె  వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సావిత్రి బాయ్ ప్రారంభించిన పాఠశాల దేశం లోనే మొట్ట మొదటి బాలికల పాఠశాల అని పేర్కొన్నారు.  ఏడాదిలోనే మహారాష్ట్రలో మరో యాభై పాఠశాలలను స్థాపించారు అని తెలిపారు అగ్ర కులస్థుల నుండి ఎన్ని అడ్డంకులు ఎదురుకున్నారు మానవ హక్కుల గురించి స్త్రీలని చైతన్య పరచి 1852 లో మహిళా సేవ సంఘాన్ని స్థాపించారు. అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆమె సేవను గుర్తించి ఉత్తమ ఉపాధ్యయూరాలుగా అవార్డు ఇచ్చారని అన్నారు. ఎందరికో విద్య బుద్ధులను నేర్పిన సావిత్రి బాయ్ పూలె ఎందరికో స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఖాండ్రే  నిర్మల, బిజెవైఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాధిక, నాయకులు సుభాష్,మారుతీ, రంజిత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment