కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 4 ; భారత విద్యార్ధి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ఐ అద్వర్యం లో ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన పదవ తరగతి విద్యార్ధి విద్యార్థినులకు నిర్వహించిన ట్యాలెంట్ టెస్ట్ ఫలితాలను ఆదివారం ఆసిఫాబాద్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయం లో విడుదల చేయడం జరిగినదని. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చపేలా సాయి కృష్ణ తెలిపారు. ఈ యొక్క ఫలితాల్లో జిల్లా మొదటి బహుమతి కత్తి కళ్యాణి, (జడ్పిఎస్ఎస్ కగజ్నగర్ ) రెండొవ బహుమతి బొజ్జ శ్రీజ,(మయూరి విద్యాలయం కౌటాల )తృతీయ బహుమతి ఎన్ శిశిధర్ రాజ్, (టి ఎస్ మోడల్ పాఠశాల ఆసిఫాబాద్) అదేవిదంగా ఏడుగురికి ప్రోస్సహక బహుమతులు కూడ అందజేయనున్నట్టు తెలిపారు. ఈ యొక్క బహుమతులను మార్చ్ ఎనిమిదో తేదీన బహుమతి ప్రదానోస్సవం జరుపుతామని పేర్కొన్నారు.అదేవిదంగా ఈ యొక్క ట్యాలెంట్ టెస్ట్ లో సుమారు మూడువేల రెండువందల మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు వారందరికీ అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment