Thursday, 29 March 2018

తెలుగు దేశం 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 29 ;   తెలుగు దేశం  37 వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా  రెబ్బెన మండలంలోని గోలేటి లో    జెండా ఎగురవేసారు. అనంతరం  టిడిపి  మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి మాట్లాడుతు తెలుగుదేశం ప్రభుత్వ హయం లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి బడుగు బలహీన వర్గాలు కు చేయూత అందిందన్నారు.ఇప్పుడున్న తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంది అన్నారు.    తెలుగు నైజం గురించి ప్రసంగించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ `కి మంచి భవిష్యత్తు ఉందని నాయకులు కార్యకర్తలు అదర్య  పడవద్దు అని సూచించారు. తెలుగు దేశం ప్రజల పక్షన వుంటూ సమన్యాయం  చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులూ గుడిమెర్థ హన్మంతరావు,,మండలాధ్యక్షుడు విజయ్,విమలక్క, కాజల్,కే శ్రీనివాస్,నాందేవ్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment