
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 25 ; తెలుగుదేశం పార్టీ చేపట్టిన పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంగ లో భాగంగా ఆదివారం రోజున రెబ్బెన మండలం గంగాపూర్ లోని ప్రసిద్ధ పున్యక్షేత్రరమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పల్లెపల్లెకు తెలుగు దేశం కార్యక్రమాన్ని గంగాపూర్ గ్రామం నుండి మొదలు పెట్టినట్టు టిడిపి జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి ఆనంద్ తెలిపారు.ఈ సందర్బంగ గంగాపూర్ గ్రామంలో టిడిపి జెండా ఆవిష్కరణ చేసి తదనంతరం ప్రచార కార్యక్రమంలో భాగంగా గడప గడప కు తెలుగు దేశం పార్టీ అనే నినాదంతో ప్రజల సమస్యలను తెలుసుకున్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన రావడం జరిగిందని తెలిపారు అనంతరం రెబ్బెన మండలం లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ రావడమే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు పల్లె ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ప్రజల వద్దకు పాలన అనేది మాండలిక వ్యవస్థను తీసుకురావడం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదన్నారు. పార్టీకి స్వర్గీయ నందమూరి తారకరామరావు.హైటెక్ విధానంతోనే ఎంతోమంది ఉపాధి కల్పించిన రూపకర్త జాతీయనాయకుడు అధ్యక్షుడైన చంద్రబాబునాయుడు అని ఎన్నో విధాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోనే తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం,విద్యుత్ సౌకర్యం,వాటర్ సప్లై నీళ్ల ట్యాంకులు,నల్లా వ్యవస్థ, విద్య వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకుపోయిన ఘనత తెలుగుదేశం పార్టీది అని అన్నారు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని అబండాలు వేసి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడమే ధ్యేయంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడు పరిపాలన సాగింది అన్నారు . అవినీతి అక్రమాల మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని ఆ కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టి, తెలంగాణ నాదాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ వాదం తన సొంతమైనట్టే ఇప్పుడున్న తెరాస పార్టీ దొర కేసీఆర్ బంగారు తెలంగాణను చేస్తా అని చెప్పి,తెలంగాణ సాదించుకున్నాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, గద్దె మీద ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రి ఆయన అల్లుడు మంత్రి అయన కూతురు పార్లమెంటు మెంబరు ఇప్పుడు కొత్తగా ఆయన మరదలు కొడుకైన సంతోష్ రాజ్యసభకు. ఆయన ఇంట్లోనే పదవులు ఇచ్చుకుంటూ ఆయన బంగారు తెలంగాణ ఆయన స్వంత కుటుంబంలో నడుస్తున్నదని అన్నారు .సంతోష్ కు ఇచ్చిన రాజ్యసభ మెంబరు. శ్రీకాంత చారి తెలంగాణ కోసం ఒంటి పై కిరోసిన్ పోసుకుని మరణిస్తే వాళ్ల తల్లిని ఓడిపోయే చోట సీటిచ్చి ఓడిపోయిన శ్రీకాంత చారి తల్లికి రాజ్య సబ మెంబర్ పదవి ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం రాలేదని ప్రశ్నించారు. పల్లెపల్లెకు తెలుగుదేశం ప్రతి గ్రామంలో ప్రజలు గుర్తిస్తున్నారు అన్నారు.ఆనాడు కాంగ్రెస్ ఈనాడు తెరాస రెండు దొందు దొందు లాగే కనిపిస్తున్నాయి అని మళ్లీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అధికారం లోకి వస్తుంది అని జోస్యం చెప్పారు. పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా అంకితభావంతోనే ఏ స్వార్థం లేకుండా పార్టీని నడపాలని కార్యకర్తలకు సూచించారు.అనంతరం టిడిపిలో చేరికలు జరిగాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేష్, కుందారపు జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి మురళి, జిల్లా ఉపాధ్యక్షులు సాదిక్ అలీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుగు ఆత్మారావు మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ మరియు జిల్లా నాయకులు హనుమంతరావు, నాందేవ్ , ఆశిష్, రాజేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment