కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 6 ; ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ఈ నెల 13 న తలపెట్టిన జిల్లా బంద్ కు అన్ని పార్టీలు, అన్ని కులసంఘాలు వ్యాపారస్తులు స్వచందంగా తమ మద్దతు ప్రకటించి బంద్ ను జయప్రదం చేయాలనీ ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మారే కుంట కేశవరావు కోరారు. కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని అతిధి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఇరవైనాలుగు సంవత్సరాలనుండి ఎన్నో ఉద్యమాలు చేస్తున్న పాలక వర్గాలు పట్టించుకోనందుకు ఈ బంద్ పిలిపు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులూ నారాయణ,బొంగు నర్సింగ రావు, చిలుముల నర్సింహులు, రమేష్, ప్రభాకర్, దుర్గం రాజేష్, రావూజి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment