కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 8 ; మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటు, రిజర్వేషన్లతొ పాటు ప్రత్యేక హోదాలని కల్పిస్తూ మగవారితో సమానంగా ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో సమన్వయ పట్టుని ఇస్తుందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలో ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్, మహిళా జిల్లా అధ్యక్షురాలు కుందారపు శేంకరమ్మ అద్వర్యం లో నిర్వహించిన మహిళ దినోస్సవ కార్యక్రమనికి అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ముఖ్య అతిధిగా హాజరై మాట్లారు. తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వరకట్నం వేధింపులు తగ్గాయని, వాటి నిర్మూలనకై సీ టీములు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహిళా భద్రత కోసం ఎంతో తోడ్పాటు చేస్తుందని అన్నారు. అలాగే మహిళలు అందరు ఎంతో ఓర్పుతో ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని అన్నరు. అదేవిదంగా మహిళలు అందరు ఏ పనిలో ఐనా కూడా తమను తాము నిరూపించుకోవాలని అది రాజకీయాలు ఐన, ఉద్యోగంలో ఐన, ఇల్లాలిగా ఐన మన మహిళల్లో ఇంకా చైతన్యం రావాలి,మహిళలకు నాన్న తో పాటు భర్త సహకారం ఉండటం వల్లే మహిళాలు ముందంజలో ఉంటున్నారాని అలాగే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టాలు ఉన్నాయ్ అని పోలీస్ వ్యవస్థ కూడా వారి డ్యూటీ ని సక్రమంగా నిర్వర్తిస్తున్నందున మహిళలకు పూర్తిగా రక్షణ ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శేంకరమ్మ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మహిళా నృత్యాలు అలరించాయి. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని ఆనందోస్సవాంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, నంబాల గ్రామ సర్పంచ్ గజ్జెల సుశీల,పద్మ,మోడెం సుదర్శన్ గౌడ్,చిరంజీవి గౌడ్,చెన్న సోమ శేఖర్,మురళి తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment