సమగ్ర గిరిజన భూ అభివృద్ధి పథకం అమలు తీరుపై సమీక్షా సమావేశం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 17 ; కొమురంభీం జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవం పాటిల్ శనివారం తన కార్యాలయంలో సమగ్ర గిరిజన భూ అభివృద్ధి పథకం అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి మండల మరియు జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా . పాలనాధికారి మాట్లాడుతూ క్రిందటి సమావేశం తర్వాత అమలైన పనుల గురించి , మరియు పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసి జిల్లాలో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. లబ్ది దారులను మూడు కేటగిరీ లుగా విభజించి ఒకటవ కేటగిరీలో భూమి మరియు బోరెవెల్ ఉండి విద్యుత్ సరఫరా లేనివాటిని ,రెండవ కట్రరీలో బోర్ ఉండి విద్యుత్ సరఫరా లేనివాటిని, గుర్తించి నివేదికలు పంపించాలన్నారు. జిల్లాలోని 851 బ్లాక్ లలో ఎస్ టి లబ్ధిదారులు 5794 , ఏరియా వారీగా 22509గా ఉన్నట్లు తెలిపారు. స్థానిక ఎంపీడీఓ , ఏపీఎం లు సంబంధిత అధికారులు సకాలంలో సర్వే నిర్వహించి వచ్చే నెల నాలుగు లోపు నివేదికలు పంపాలన్నారు. . ఈ సమావేశం లో డి ఆర్ డి ఏ వెంకట్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment