కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 ; ఆపద్భాందవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శనివారం మండలంలోని గురుడ్పేట గ్రామంలో మాజీ ఎంపిపి నికాడు గంగారాం కొడుకు విష్ణుమూర్తికి ప్రమాదవశాత్తు రెండు కాళ్లు పోవడంతో ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రెండు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఆదుకునే దేవుడిలాగా మన ముఖ్యమంత్రి పేదలను ఆదుకుంటున్నారని అన్నారు. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలోప్రజలకు పాలన దగ్గర కావాలని ఉద్దేశంతో పాలనాపరమైన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు, మండలాలు, ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చేనెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ లేదా పరిశ్రమల శాఖమంత్రి తారకరామారావు కాగజ్ నగర్ రానున్నట్లు ఆయన తెలిపారు. గతంలో విష్ణుమూర్తికి ప్రమాదం జరిగినప్పుడు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబులెన్స్ లో హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స చేయించారానీ , ముఖ్యమంత్రి నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చేసినందుకు విష్ణుమూర్తి తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ విశ్వనాథ్, జడ్పీటిసి డప్పుల నానయ్య, ఐటిడిఏ డైరెక్టర్ కుమ్రం మాంతయ్య ఆరెఎస్ఎస్ మండల అధ్యక్షుడు మేర్పల్లి బ్రహ్మయ్య, యాదవ సంఘం మండల శాఖ అధ్యక్ష ఉపాధ్యక్షుడు గట్టయ్య, సంతోష్, సీనియర్ నాయకులు నక్క శంకర్ నాయకులు గుర్రం శ్రీధర్, పసునూరి తిరుపతి, సకినాల సురేష్, బండి శ్రీనివాస్, రవీందర్ గౌడ్, ఎస్సై రాజు కుమార్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment