Tuesday, 27 March 2018

ఉపాధి హామి పనులు ప్రారంభం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 27 ; రెబ్బెన గ్రామ పంచాయితి లో గల నక్కలగుడ గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులకింద  రైతుల వ్యవసాయ భూముల కు వెళ్లే   దారి  నిర్మాణ  పనులను రెబ్బెన గ్రామ సర్పంచ్  పెసరి వెంకటమ్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మొడెం భీమన్న గుడి నుండి మొయిన్ కెనాల్ వరకు దారి  పనులకు  4,91,144/-రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ యొక్క రోడ్డు పనులు రైతులకు ఎంతగానో ఉపయొగపడుతయని రైతులకు ఉపయొగపడే పనులను ఉపాధి హామి పథకం ద్వార అభివృద్ది  చేయడం జరుగుతుంది అని అన్నారు.   ఈ కార్యక్రమంలో    సింగిల్ విండో డైరెక్టర్  మధునయ్య, ఫీల్డ అసిస్టెంట్లు  తుకారాం, తిరుపతి,  ఉపాధి హామి కూలీలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment