Friday, 16 March 2018

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుకై వినతి పత్రం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 16 ; కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సబబు కాదని టిఎస్ సిపిఎస్ఈయూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దింటి క్రాంతి అన్నారు.   శుక్రవారం కొమురంభీం జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ని అధికారులు మరియు కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. సిపిస్ రద్దు రాష్ట్ర పరిధిలోని అంశమని సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆర్ టిఐ  కాపీని  జిల్లా సంయుక్త పాలనధికారి వై సురేందర్ రావు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కి  పంపిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రం మీరు సి పి  ఎస్  విధానంలో కొనసాగుతారా లేదా తెలియజేయలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. మేము  సి పి  ఎస్  విధానంలో నే కొనసాగుతామని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తెలుయజేసిందన్నారు. ఇప్పటికి పక్షిమబెంగాల్, త్రిపుర రాష్టలలో పాత పెన్షన్ విధానం కొనగుతుందని అన్నారు. కావున సి పి  ఎస్  విధానంలో కొనసాగాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అని అన్నారు. కావున సి ఐ ఎస్  విధానాన్ని రద్దు చేసి దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం  కావాలని కోరారు.  ఈకార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి ముడిమడుగుల తిరుపతి,జిల్లా ముఖ్య సలహాదారు రఫతుల్లా హుస్సేన్ , జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల మోహన్ ,వాంకిడి అధ్యక్షులు చందా విట్ఠల్ ,ప్రధాన కార్యదర్శి జాడే రాహుల్,కాగజ్ నగర్ కార్యదర్శి వసంత్,తదితర సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment