Wednesday, 14 March 2018

జిల్లా నుంచి ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలి – కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 14 ;   జిల్లా నుంచి ఉన్నత  స్థాయి క్రీడాకారులు రావాలని వారు రాష్ట్ర, జాతీయ , అంతర్జాతీయ క్రీడాకాలుగా ఎదగాలని   క్రీడల తో  ఉన్నత మైన, ఉజ్వల  మైన భవిష్యత్తు ఉంటుందని  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.బుదవారo జిల్లా లోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ లో  పోలీసులు మీకోసం లో బాగం గా జిల్లా పోలీస్ లు చేపట్టిన స్పోర్ట్స్ స్కూల్  సెలక్షన్ కై  ప్రీ స్క్రీన్ టెస్ట్ లను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేనవార్ లు జెండా ఊపి ప్రారంబించారు, అనoతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి తో  కలిసి తొమ్మిది  ప్రీ స్క్రీన్ టెస్ట్ లను పర్యవేక్షించారు, జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ జిల్లా పోలీస్ లు సామాజిక బాద్యత గా , ఒక మహోన్నతమైన కార్యక్రమునకు శ్రీకారం చుట్టారని అన్నారు, ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమమునకు జిల్లా పాలనా యంత్రాగం తరుపున పోలీస్ వారికీ అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని,జిల్లా పోలీసులు నిర్వహించే వేసవి శిక్షణ తరగతులకు కూడా సహాయం అందిస్తామని , ఇటువంటి  కార్యక్రమం  ద్వారా మారుమూల ప్రాంతాల వారికి కూడా క్రీడల పట్ల , క్రీడా స్కూల్ ల పట్ల అవగాహన కలిగి వారి వారి పిల్లలను ఉన్నత గా ఎదిగేందుకు ముందడుగు వేస్తారన్నారు. అనoతరం జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేన వార్ మాట్లాడుతూ  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అద్వర్యం లో నిర్వహించే పరిక్షల ద్వారా  తెలంగాణా రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ లో  ప్రవేశం లబిస్తుందని , ఈ స్కూల్ ల లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచితం గా డిగ్రీ వరకు  చదువు  ఉచిత బోజన వసతి ఉంటాయని ,  ఉత్తమమైన శిక్షకులతో శిక్షణ వుండటం వల్ల దేశం గర్వించే మేటి క్రీడాకారులు ఇక్కడి నుంచే వస్తారని తెలిపారు  స్పోర్ట్స్ అకాడమీ నందు క్రమము తప్పకుండ శిక్షణ మరియు బోదన అంశాలను బోదిస్తారని జిల్లా నుంచి ఎక్కువ మంది ఈ స్కూల్ లకు ఎంపిక అయ్యేలా జిల్లా పోలీస్ ల అద్వర్యం లో ప్రీ స్క్రీనింగ్ టెస్ట్ లో ఎంపిక కాబడిన విద్యార్థిని , విద్యార్థులకు తొమ్మిది శిక్షణ అంశాల పైన  ఉచిత వేసవి శిక్షణ తరగతులను నిర్వహించి తర్ఫీదు ను ఇస్తామని జిల్లా ఎస్పి తెలిపారు, ఇక పైన కూడా జిల్లా లోని వివిధ మండలలో ఈ ప్రవేశాలను నిర్వహిస్తామని జిల్లా ఎస్పి తెలిపారు.

No comments:

Post a Comment