Saturday, 7 March 2020

అక్రమ నిర్మాణాలు ఆపాలి : ఆదివాసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

 బెజ్జూర్ : అధికారులు, పాలకులు  చట్టాలకు విరుద్ధంగా భూమి అక్రమాలకు పాల్పడుతూ స్థానిక ఏజెన్సీలోని ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తున్నారని కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బిబ్బెర భూమయ్య అన్నారు. శనివారం  బెజ్జూర్ మండల ఆదివాసి కొలవార్ (మన్నేవార్) సేవా సంఘం నాయకులు కొమురం భీం విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.   బెజ్జుర్ మండల కమిటీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాజాగా చింతలమానేపల్లి మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చిన సంఘటనను ఖండిస్తూ  ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలు GO MS NO:- 3 ఆర్టికల్ 342, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పేసా చట్టాలు ఉన్నప్పటికీ అక్రమకట్టడాలను ప్రోత్సహిస్తున్న చింతలమానేపల్లి మండల తాసిల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.1/70 పేసా చట్టాలకు రాజ్యాంగంలోని 5,6వ షెడ్యూల్ కు విరుద్ధంగా అక్రమ కట్టడాలు చేపడుతున్నవారిపై వెంటనే (SC, ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆగడాలను అరికట్టాలని అన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి దీనిపై స్పందించని యెడల రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బెజ్జూర్ మండల అధ్యక్షులు పెద్దల శంకర్, ఉపాధ్యక్షులు డబ్బ తిరుపతి, యూత్ అధ్యక్షుడు మండిగ చంటి,  యూత్ఉపాధ్యక్షులు బిబ్బెర రమేష్, వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆదివాసీ కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment