Friday, 6 April 2018

జైనూర్ గాధి గూడ లో కార్డాన్ సెర్చ్


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 6 ; కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  జైనూర్ సర్కిల్ పరిధి లోని గాధి గూడ గ్రామము లో కార్డాన్ సెర్చ్  నిర్వహించారు.  శుక్రవారం  ఉదయం 4 గంటలకు ఆసిఫాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యం లో  నిర్వహించిన ఈ సెర్చ్ లో   3 కేజీల గంజాయి, నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 25000/- రూపాయల విలువ చేయు 20 టేకు కలప దుంగలను, సరైన ధ్రువపత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను, ఆటో ను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. అక్రమ ,నిషేధిత వస్తువులను తమ తో వుంచుకొడం వల్ల కలిగే అనర్థాలను గురించి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్డాన్ అండ్ సెర్చ్ నందు సీఐ సాదిక్ పాషా,ఎస్సైలు గౌతం,రాజు,శ్రీనివాస్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

1 comment: