Friday, 6 April 2018

బహిరంగ మల మూత్ర విసర్జన పై అవగాహన కార్యక్రమం


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 6 ; స్వచ్ఛభారత్ కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని  మొదటగా బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా ప్రభుత్వం   ఇంటింటికి మూత్రశాలలు కట్టుకోవడానికి ఇచ్చే పథకం ను ఉపయోగించుకోవాలని జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ సభ్యులు శుక్రవారం రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో ఉదయం నడక కార్యక్రమంలో డప్పు చాటింపు ద్వారా   అవగాహన  కల్పించారు. జిల్లాని బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా  అన్నారు. ప్రభుత్వం ఓ డి ఎఫ్ పథకం కింద కేటాయించిన 12000 రూపాయలతో మూత్రశాలలు కట్టించుకోవాలని అన్నారు.   ఈ కార్యక్రమంలో  జిల్లా స్వచ్ఛభారత్ బృందం సభ్యులు ప్రశాంత్, చంద్రశేఖర్, ఫణి కుమార్, గంగాపూర్   గ్రామ సర్పంచ్ రవీందర్, ఏ   పి   ఎం వెంకటరమణ, ఏ  పి  ఓ కల్పన, తదితరులు పాల్గొన్నారు. 

1 comment: