Tuesday, 1 May 2018

తెరాస మహిళా విభాగం నుంచి ప్రభుత్వాస్పత్రిలో అల్పాహారం పంపిణి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 1 ;  సేవా దృక్పధం తో తెరాస మహిళా విభాగం నుంచి రెబ్బెన టౌన్ అధ్యక్షురాలు ఎం పద్మ, ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ లు  మంగళవారం  రెబ్బెన  ప్రభుత్వాస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు అల్పాహారం  పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతు  ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారికీ  తమ వంతు సాయ సహకారాలు అందించాలన్న సేవా దృక్పధం తో ప్రతి మంగళవారం రోజున ప్రభుత్వాస్పత్రిలో పండ్లు, అల్పాహారలను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణా ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పధకాలను వివరించారు. తెరాస పార్టీ మహిళా కార్యకర్తల విభాగం తరుపున ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపడతాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది భాగ్యలక్ష్మి, లీలా, ఉమా, ప్రమీల, పావని తో పాటు తదితరులు పాల్గొన్నారు.     

No comments:

Post a Comment