Wednesday, 18 January 2017

బస్సు జాతను విజయవంతం చేయండి ; రవీందర్

బస్సు జాతను విజయవంతం చేయండి ; రవీందర్ 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ;  తెలంగాణ రాష్ట్రంలో  విద్య వైద్య రంగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎ ఐ ఎస్ ఎఫ్, ఎ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 తేదీనాడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ స్వంత నియోజకవర్గం నుండి  బస్సు జాత ప్రారంభమ అవుతుందని జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం రవీందర్ తెలియజేశారు . ఈ సందర్బంగా గోలేటిలోని కెల్ మహేంద్ర భవన్ లో బస్సు జాతకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతు  రాష్ట్రంలోని విద్యార్థులకు యువకులకు ప్రజలకు విద్య వైద్యం ఉపాధి హక్కులు కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్,ఎ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్, గోలేటి పట్టణ అధ్యక్షులు పడాల సంపత్,నాయకులూ పాల్గొన్నారు. .                                                                       

No comments:

Post a Comment