కంప్యూటర్ ఫీజు మాఫీ చేయాలని డిజిఎం కు ఎ ఐ ఎస్ ఎఫ్ వినతి 
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : గోలేటిలోని సింగరేణి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను ఉచితంగా అందించాలని ఈ విద్య సంవత్సరం కంప్యూటర్ ఫీజు ను మాఫీ చేయాలని కోరుతు ఎ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల కరెస్పాండెంట్ మరియు బెల్లంపల్లి ఏరియా డిజిఎం పర్సనల్ జె.చిత్తరంజన్ కూమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగ ఎ ఐ ఎస్ ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి పూదరి సాయికిరణ్ మాట్లాడుతు ఈ విద్యాసంవత్సరంలో కంప్యూటర్లు పనిచేయక కంప్యూటర్ విద్య విద్యార్థులకు అందని ద్రాక్షగానే మిగిలిందని,కావున కంప్యూటర్ రుసుమును మాఫీ చేయాలని ఆయన కోరారు.విద్యార్థుల తల్లిదండ్రులు సింగరేణీయులు కానప్పటికీ సంస్థ సహృదయంతో విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని వారిది ఫీజులు కట్టలేని పరిస్థితి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఎఫ్ గోలేటి పట్టాన అధ్యక్షులు పడాల సంపత్,కార్యదర్శి జాడి సాయి,నాయకులు కందుల శ్రీకాంత్,కె.సాయి,అశోక్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment