తాసీల్ధార్ కార్యాలయం ముoదు ధర్నా
కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : రెబ్బెనలోని మసీదు భూమి అన్యాక్రాంతానికి గురి అయిందని తమ భూమి ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తు మైనారిటీ సభ్యులు రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ గతంలో మసీదుకు విరాళం యిచ్చిన భూమిలో కొంత భాగంలో మసీదును నిరుమించగా మిగిలన భాగం ఖాళీ గ ఉన్నాదని పేర్కొన్నారు. మసీదు మందిరం సరిపోక నూతనంగా మసీదు నిర్మాణానికి బుధవారం మసీదు నిర్మాణం చేయడానికి ఖాళీ స్థలంలో బుధవారం బోర్ వేయడానికి భూమి పూజ చేయడం తో మసీదు ఆనుకొని ఉన్న కోస్టల్ డిపార్ట్మెంట్ వారు అడ్డుకున్నారన్నారు మసీదు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి తమ భూమి తమకి అప్పగించాలని డిమాండ్ చేసారు. ధర్నా చేస్తున్న మైనారిటీ సభ్యుల వద్దకు జెడ్ పి టి సి అజమేరా బాబు రావు ఎంపీపీ సంజీవ్ కుమార్,రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మలు చేరుకొని త్వరలోనే భూమిని సర్వే చేయించి న్యాయం జరిగే ల చూస్తామని హామీ ఇవ్వడం తో శాంతించిన మైనారిటీ సభ్యులు ధర్నా విరమించారు. ధర్నాలో మైనారిటీ కోఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని, జబి , మన్సూర్ అలీ, జహీర్ బాబా,ఆప్తాప్ , జహూర్,జంసిద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment