ఎన్ ఎస్ ఎస్ శిబిరంలో రోడ్ల పై మూళ్ళ పొదలు తొలగింపు
కొమురం బీమ్ ఆసిఫాబాద్ (వుదయం) జనవరి 16; రెబ్బెన ; ఎన్ ఎస్ ఎస్ శిబిరం లో రెబ్బెన ఆర్ట్స్ &సైన్స్ కళాశాల విద్యార్థులు రెబ్బెన మండలం లోని నేర్పెల్లి గ్రామంలో రోడ్ ల పై ఉన్న చెత్త చెదారం మూళ్ళ పొదలను తొలగించి స్థానిక హనుమాన్ మందిరం ప్రాంగణం లోని పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రత పై స్థానికులకు అవగాహనా కల్పించారు అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పుదారి మల్లేష్ మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన స్వచ్చభారత్ ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులను చూసి ప్రతి ఒక్కరు అవలంబించుకోవాలని అలాగే విద్యార్థులు చిన్ననాటి నుంచి మంచి మార్గంలో పయనించి సేవ భావం కలిగేలా ఎన్ ఎస్ ఎస్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దేవాజి ,ఫణికుమార్ ,శ్రీనివాస్ ,శ్రీకాంత్ ,శాంతి ,షాలిని ,స్వప్న ,విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment