Tuesday, 3 January 2017

విద్యార్థినిలు సావిత్రి బాయి పూలెను ఆదర్శంగా తీసుకోవాలి:పూదరి సాయికిరణ్

విద్యార్థినిలు సావిత్రి బాయి పూలెను ఆదర్శంగా తీసుకోవాలి:పూదరి సాయికిరణ్  


కొమురం బీమ్ (ఆసిఫాబాద్) ,వాంకిడి ;   (వుదయం ప్రతినిధి) సావిత్రి బాయి పూలె స్వేచ్ఛకు గుర్తని, ఒక సేవకు ప్రతి రూపం అని, ఆత్మవిశ్వసపు సంచలనమని సావిత్రి బాయి పూలేను ప్రతి ఒక్క విద్యార్థిని,  స్త్రీ లు ఆమెను   ఆదర్శంగా తీసుకోవాలని    ఏ ఐ ఎస్ ఏఫ్  డివిజన్ ప్రధాన కార్యదర్శి పూదరి సాయికిరణ్,అధ్యక్షులు బావునే వికాస్,అన్నారు. తరతరాల అవమానాలు, వెనకకు నెట్టిన కులాలు, చదువుకు దూరం చేసి, మూఢ నమ్మకాలలో నిండాముంచి, స్త్రీని ఆటవస్తువుగా చుసిన నా దేశములో, స్త్రీని మనిషిగా చూసేలా తీర్చిదిద్దిన మూఢత్వమే రాజ్యముగా  ఉన్న దేశంలో వెలుతురు చుపే దారిగా వచ్చిన ఉపాధ్యాయురాలిని సావిత్రి బాయి పూలె అని అన్నారు. సావిత్రి బాయి పూలె 186వ జయంతి సందర్బంగా వాంకిడి మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం లో ఆమె చిత్రపటానికి   పూలమాల వేసి నివలులు అర్పించారు. విద్యతోనే అసమానతలు తోలిగి పోతాయని, విద్యతోనే విప్లవాత్మక మార్పులు వస్తాయని, విద్యావ్యాప్తికి కృషి చేస్తూ అగ్ర వర్ణాల అధిపత్యాని, సాంఘిక దురాచారాలను నిరసించి ఉద్ద్యమాన్ని చేసి మహిళలకు విద్యను బోధించింది సావిత్రి బాయి  పూలె అని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహల ప్రోత్సాహం, అనాధ బాలాలదత్తాత వంటి సామజిక కార్యక్రమాలను ప్రోత్సహించి అనేక మందిలో చైతన్యం కలిగించింది సావిత్రి బాయి పూలె అని అన్నారు. అడా పిల్లలను వంటింటికే పరిమితం చేసే విధానాలను వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కున్న గొప్ప ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలె అని అన్నారు. పూలెని  ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్  నాయకులూ  జాడి సాయి, కేజీబీవీ ఎస్వో దీపికా,ఉపాధ్యాయినులు,విద్యార్థినిలు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment