కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా జరుపుకోవాలి
కుమురం బీమ్ ఆసిఫాబాద్ ( వుదయం ప్రతినిధి) రెబ్బెన ; జనవరి 06 ; కొలవార్ భీమ దేవర జండా పండుగను గిరిజన గ్రామాలలో జరుపుకోవాలని ఆదివాసీ కొలవార్ సంఘం మండల అద్యక్షుడు మైలారం శ్రీనివాస్, తుడుందెబ్బ అద్యక్షుడు ఎర్గటి సుధాకర్, జిల్లా తుడుందెబ్బ అధ్యక్షలు ఎరగటి గోపాల్ లు అన్నారు. రెబ్బెన మండలంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 8వ తేది నుండి 15వ తేది వరకు "భీమ దేవర జండా పండుగ" 15వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నామని కోమారం భీం జిల్లా స్థాయిలలో అన్ని మండలలో కోలవార్ జెండా పండుగను ఆయా కొలవార్ గిరిజన గ్రామాలు మరియు గిరిజన గుడాలలో జరుపుకొని తమ జాతి ఔన్నత్యాన్ని చాటుకోవాలని, తమ పురాతన సంప్రదాయాలను మరవరాదని పిలుపును ఇచ్చారు. ఈ కొలవార్ జెండా పండగ సందర్భంగా గ్రామా గ్రామాలలో ప్రచారం చేసుకుంటూ 7రోజుల పండగను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమవేశం లో మండల ఉపాధ్యక్షుడు కోడిపె వెంకటేష్, మండల కార్యదర్శి బుర్స. పొచమల్లు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment