ముఖ్యమంత్రి కే సి ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కుమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) రెబ్బెన ; జనవరి 05 ; రెబ్బెన మండలంలో గురువారం బస్టాండ్ లో కేసీఆర్ చిత్ర పటానికి మత్స్య కారుల అద్వర్యం లో పాలాభిషేక కార్యక్రమం చెప్పట్టారు , ఈ సందర్బంగా మత్స్య సంఘ అధ్యక్షులు ,సత్యనారాయణ , ఉపాధ్యక్షులు భానుప్రసాద్ లు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గతంలో ఎన్నడూ లేనంత ఇటీవలే పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ దే అని అన్నారు . తాజాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనలో తెలంగాణ లో మత్స్య పరిశ్రమలకు దన్నుగా నిలవనుంది అన్నారు . అటు మత్స్యకారులకు మల్లి ఉపాధి దక్కడం ,మత్స్యపరిశ్రమ ఆవహివృద్ది తోడ్పడుతుందని . మండలం లో చేపల పెంపకాని ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాథ సంజీవ్ కుమార్ , ఆసిఫాబాద్ వైస్ చౌర్మెన్ కుందారపు శంకరమ్మ , ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ , నాయకులు చిరంజీవి గౌడ్, సుదర్శన్ గౌడ్ ,సత్యనారాయణ్ గౌడ్, మత్స్య కారులు బి. రామయ్య ,బి నాగయ్య ,బి గంగయ్య ,బి భేమయ్య ,బి పోషయ్య , బి శంకర్ , బి మలేష్ ,బి పోశం , బి రాములు , బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment