Wednesday, 4 January 2017

డిపెండెంట్ సర్టిఫికెటు అవసరము లేదు ; సదాశివ్

డిపెండెంట్ సర్టిఫికెటు అవసరము లేదు ; సదాశివ్ 

కుమురం బీమ్  ( వుదయం ప్రతినిధి) జనవరి 04;  సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకోసము డిపెండెంట్ సర్టిఫికెటు అవసరము లేదని టి బి జి కె ఎస్ ఏరియా ఉపాద్యాక్షుడు స్నాల్గొండ సదాశివ్ అన్నారు . గోలేటి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశములో ఆయన మాట్లాడారు . సింగరేణి యజమాన్యం వారసత్వ ఉద్యోగాల కోసము కొన్ని నిబంధనలను విధించిందని అన్నారు , కానీ  సింగరేణి యాజమాన్యముతో టి బి జి కె ఎస్ అధ్యక్షులు వెంకట్ రావు , ప్రధాన కార్యదర్శి కె మల్లయ్య , ఉపాధ్యాయులు రాజి రెడ్డి కానక రాజు లు మాట్లాడి డిపెండెంట్ సర్టిఫికెట్లను రద్దు చేయించారని తెలిపారు . ఈ విషయం కార్మికులు గమనించాలని పేర్కొన్నారు . ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే వారు ఆధార్ కార్డు ,ఎంప్లొయీమెంటు కార్డు  , పాన్ కార్డు/ రేషన్ కార్డు / ఓటర్ కార్డు / జత పర్చాలని తెలిపారు.

No comments:

Post a Comment