Tuesday, 31 January 2017

తహసీల్ధార్ కార్యాలయాన్ని సందర్శించిన రాజస్వ మండలాధికారి


తహసీల్ధార్ కార్యాలయాన్ని సందర్శించిన రాజస్వ మండలాధికారి


కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 31 ; రెబ్బెన మండల తహసీల్ధార్ కార్యాలయాన్ని మంగళవారంనాడు ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి (ఆర్డీవో) పాండురంగరావు సందర్శించారు.కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు.ఈ సందర్బంగ ఆయన మండలంలోని అస్సైన్డ్ భూములు,కాస్తులో ఉన్న భూముల వివరాలు తెలుసుకున్నారు.కల్యాణ లక్ష్మి పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగ  అందెలా చూడాలని అన్నారు.అదే విదంగ పెళ్లి నిశ్చయం కాగానే అర్హులు వెంటనే దరాఖాస్తు పెట్టుకోవాలని సూచించారు.గ్రామా,మండల సిబ్భంది,స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చి గ్రామాలలో ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం,షాదీ ముబారక్,ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని,సరైన లబ్ధిదారులను ఎన్నుకోవాలని అన్నారు.ఆర్డీఓ తో తహసిల్ధార్ బండారి రమేష్ గౌడ్,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.    

No comments:

Post a Comment