లక్షల్లో నష్ట పరుస్తున్న నాయకులు
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 28 ; బెల్లం పల్లి ఏరియా లోని గోలెట్ 1 , 1ఏ గనులలో బొగ్గు పెళ్ల రాకున్నా కంపెనీ , యూనియన్ నాయకులు కుమ్మక్కై లక్షల్లో నష్ట పరుస్తున్నారని టి ఆర్ ఎస్ రెబ్బెన కార్మిక సంఘ అధ్యక్షుడు, టి బి జి కె ఎస్ టౌన్ అధ్యక్షుడు గజ్జెల ప్రకాష్ రావు అన్నారు . కార్మిక సంఘ నాయకులు నచ్చ్చిన కార్మికులను ట్రాన్స్ఫర్ పేరు మీద కాళ్ళు అరిగేలా తిప్పిచించుకున్నరని తెలిపారు . కంపెనీ, యూనియన్ నాయకులు ఏకమై తమ చుట్టూ తిప్ప్పు కుంటూ, పబ్బం గడుపుతున్నారని అన్నారు. కార్మికుల కష్టాలను గుర్తించకుండా కష్టపెడుతున్నారని తెలిపారు . ఇటువంటి కార్మికసంఘ నాయకులను ఉండకుండా చూడాల్సిన బాధ్యత కార్మకుల పై ఉందని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి గనులను అభివృద్ధి పరుస్తూ ఉంటె , కొందరు నాయకుల ద్వారా అపకీర్తి వస్తుందని అన్నారు.
No comments:
Post a Comment