కుమురం భీమ్ ( వుదయం ప్రతినిధి) ఆసిఫాబాద్; సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని గత 7రోజులనుంచి నిరవధిక సమ్మెలు చేపట్టిన ప్రభుంత్వంలో ఏలంటి చలనం రాలేదుఅని కాంట్రాక్ట్ లెక్చర్లు ఆరోపించారు. శుక్రవారం 8వ రోజున కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పాలనాదికారి కార్యాలయం ఎదుట వంట వార్పుచేసి నిరసన తెలిపారు. ఇంటర్ నోడల్ జిల్లా అధికారి గోపాల్, ప్రిన్సుపాల్ సంఘం అధ్యక్షులు మాధవరావు, జూనియర్ ఇంటర్ లెక్చరర్ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్, ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు ఎస్ తిరుపతి మరియు పలు సంఘాల నాయకులూ మద్దతు పలికి మాట్లాడారు. గత ప్రభుత్వాలు పిఆర్ సి ని అమలు చేసిన వేంటనే మూలా వేతనాలను చెల్లించారు కానీ ఈ ప్రభుత్వం చెల్లించకపోవడం అవమానకరం అన్నారు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా చెల్లించకపోవడం రావలసిన బేసిక్ మరియు డి ఏ చెల్లించాలని అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు లేక పోతే ఈ రోజు కలశాలలు మూతపడతాయని తెలిపారు వెంటనే క్రమ బద్దికరణ చేయాలనీ డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్టు లెక్చెరర్ లపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. అధ్యాపకుల సమ్మెకు వివిధ పార్టీ సంఘ నాయకులు మద్దతు పలికిన ప్రభుత్వంలో చలనం రాలేదు అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మెండి వైఖరిని వీడి తమనయమైన డిమాండ్లను నెరవేర్చలని కోరారు. జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చెరర్లు జెఏసీ నాయకులు భైరాగి, నాయిని శ్రీనివాస్, మండల్, గంగాధర్, ప్రకాష్, ప్రవీణ్, అమరేంధేర్, శంకర్, తిరుపతి తదితరులు పాల్గొనున్నారు.
No comments:
Post a Comment