Thursday, 19 January 2017

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి - సి ఐ

    విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి - సి ఐ ఎస్ వి స్కూల్  విద్యార్థులతో మాట్లాడుతున్న సి ఐ మదన్ లాల్ 

కొమురం భీం అసిఫాబాద్ (వూదయం) జనవరి 19 : విద్యార్థులు  క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి మదన్ లాల్ అన్నారు .  రెబ్బెన లోని  ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ విద్యార్థులతో గురువారం  మాట్లాడారు . విద్యార్థులు చిన్నతనము నుండే క్రమ శిక్షణను అలవరచు కోవాలని , పాఠాలు చేప్పె సమయములో ఎలాంటి అనుమానం వఛ్చిన వెంటనే ఉపాధ్యాయున్ని అడిగి తెలుసు కోవాలని పేర్కొన్నారు . అప్పుడే లక్ష్యాన్ని అధిగమించవచ్చ్చని   తెలిపారు . శ్రద్ధతో చదవాలని , పాఠశాలతో  పాటు తల్లి దండ్రులకు పేరు వస్తుందని అన్నారు . ప్రతి ఒక్క విద్యార్థికి కంప్యూటరు పై నైపుణ్యత పెంచుకోవాలని తెలిపారు . ఈ కార్య క్రమములో ఎంపిపి సంజీవ్ కుమార్ ,  ఎంపిడిఓ సత్యనారాయణసింగ్,ఎఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ,ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎన్.సదాశివ్,ఎంపిటిసి మద్దెల సురేందర్, పాఠశాల కరస్పాండెట్  దీకొండ విజయకుమారి , తెరాస జిల్లాఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్,ప్రధాన కార్యదర్శి చెన్న సోమశేఖర్,మోడెం సుదర్శన్ గౌడ్,చిరంజీవిగౌడ్, ప్రధానోపాధ్యాయుడు  దీకొండ సంజీవ్ కుమార్ .ఎ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి  పూదరి సాయికిరణ్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి  రాయిల్ల నర్సయ్య, పాఠశాల కమిటీ సభ్యులు తొగటి  లక్ష్మణ్ , గురునులే  వసంత్ రావు పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment