అసెంబ్లీ సాక్షిగా సింగరేణి లో కాంట్రాక్టు కార్మికులు లేరనడం చాలా బాధాకరం
ఏఐటియూసి బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్
ఎమ్మెల్యే ఇంటి ధర్నా చేస్తున్న జాక్ నాయకులూ
కొమురం బీమ్ ఆసిఫాబాద్ (వుదయం) ; ముఖ్య మంత్రి కె సి ఆర్ ఎన్నికల వాగ్దానములో ఇచ్చిన హామీ ప్రకారము కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాకుండా మొన్న జరిగిన అసంబ్లి సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ పూర్తిగా లేదని అనటం చాల బాధాకరమని ఏఐటియూసి బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు . సోమవారం కొమురం బీమ్ జిల్లా ఆసిఫాబాద్ ఏం ఎల్ ఏ కోవా లక్ష్మి ఇంటి ముందు ధర్నా నిర్వహచి వినతి పత్రం ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడారు .రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చే న వాగ్దానాలను నెరవేర్చా కుండా కాంట్రాక్ట్ కార్మికుల మీద చిన్న చూపు చూస్తు అసంబ్లి సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ పూర్తిగా లేదని అనడం ఎంత వరకు సమంజసము అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ కార్మికులను తమ ప్రభుత్వం అద్వార్యంలోనే పర్మినెంట్ చేస్తానని చెప్పి అట్టి వాగ్దానాన్ని విస్మరించారని అన్నారు. గుర్తింపు ఎన్నికలలో హక్కును కల్పించాలని తెలిపారు.అలాగే కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ,కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు హాస్పిటల్ బుక్స్ ,సకల జనుల సమ్మే వేతనాలు ఇవ్వాలని ,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినా సకల సమ్మెలో కార్మికులు పస్తులు ఉండిసమ్మెలో పాలుగొన్నారని ,అలాంటి కార్మికుల త్యాగాలు మరవడం సరైనది కాదని అన్నారు గత పది సం,,నుండి కార్మికులు చాలి చాలని వేతనాలు తీసుకుంటూ సంస్థ అభివృద్ధికి ,సంస్థ లాభాలు రావడానికి ప్రధానపాత్ర పోషిస్తున్నారని ,కానీ రాష్ట్ర ప్రభుత్యం కార్మిక చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వస్తుందని అన్నారు ఇప్పటికైన కేసీర్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలనీ డిమాండ్ చేశారు ఈ సందర్బముగా ఏం ఎల్ ఏ కోవా లక్ష్మి మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్కికులు ఎదురుకొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోబ్రాంచ్ కార్యదర్శి అశోక్ ,సీఐటీయూ నాయకులూ లోకేష్ ,ఇఫ్టూ నాయకులుతిరుపతి ,నారాయణ జాక్ నాయకులూ సాగర్ ,నర్సయ్య ,సదు, తదితరులు పాల్గున్నారు.
No comments:
Post a Comment