భద్రత నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి
; సి ఐ మదన్ లాల్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; భద్రత నియమాలు పాటించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి అని సి ఐ మదన్ లాల్ అన్నారు రెబ్బెన మండలంలోని అతిధి గృహంలో ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 28 వ రాష్ట్రా రోడ్డు భద్రత వారోత్స వల సందర్భముగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సభలో రెబ్బన సి ఐ జి మదన్ లాల్ మాట్లాడారు. అనంతరం రోడ్ పైన ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహన దారులు డ్రైవింగ్ లైసెన్స్ ద్వి చక్ర వాహన దారులు హెల్మెట్ తప్పక ధరించాలి అని ,వాహన ఇన్సరెన్సు పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఆదేవిధముగా ప్రభుత్వ పాఠశాలలో రోడ్ భద్రత వారోత్సవాల సందర్భముగా విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో విద్యార్థుల వారి తల్లి దండ్రులకు అవగాహన కల్పించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లే టప్పుడు తగు ట్రాఫిక్ నియమాలు పాటించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు అలాగే విద్యార్థులకు,రోడ్ల పైన ప్రమాదాలు జరిగి నప్పుడు చూస్తూ ఉండక 108 కి సమాచారం అందించి ,ప్రాణాలు కాపాడేలా ప్రయత్నించాలని సూచించారు అదేవిధముగా వచ్చే నెలలో గంగాపూర్ జాతరలో విద్యార్థులు వాలిటరిలు కొనసాగే వారు పేర్లు నమోదు చేసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ కళశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత ,కళశాల అధ్యాపకులు, ఆటో డ్రైవర్లు విద్యార్థులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment