జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా ముగ్గుల పోటీలు
కొమరం భీం ఆసిఫాబాద్ వుదయం జనవరి 24 ; రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా మంగళవారం పాఠశాల ఆవరణలో ముగ్గులువేసి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా ముగ్గుల పోటీల్లో విద్యార్థినిలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాన ఉపాధ్యాయులు డి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి బాలిక పాఠశాలలో చేరిక పాఠశాల ప్రగతికి మూలం అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సహౌపాద్యాయులు జె అశోక్, జి కవిత విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment